NTV Telugu Site icon

Vishweshwar Reddy: ఎంపీ రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు..

Konda

Konda

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి దిగజారుడు మాటలు మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి రంజిత్ రెడ్డి అడిగారు. దీంతో స్పందించిన విశ్వేశ్వర్ రెడ్డి నీకు దమ్ముంటే నా వాళ్లను తీసుకెళ్లు అని కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో.. ఫోన్ లోనే వాగ్వాదానికి దిగారు విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి. కాగా.. రంజిత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Read Also: Janga Krishnamurthy: వైసీపీ పార్టీని వీడే ఆలోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి!

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఫోన్‌లో దూషిస్తూ.. బెదిరింపులకు దిగినట్లు ఆరోపించారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏమీ లేదన్నారు. ఎంపీ రంజిత్ బీఆర్ఎస్ అయితే, తాను బీజేపీ అని తెలిపారు. ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Read Also: CACP Meeting: దక్షిణ రాష్ట్రాల CACP సమావేశం.. పాల్గొన్న ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు