కేటీఆర్ ఎవడి తాటా తీస్తాడు.. మేము కూడా అదే చెప్తున్నా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. ఎక్కువ తక్కువ మాట్లాడేది మీరు.. మేము కౌంటర్ ఇవ్వగానే గోల చేస్తారని, ఫోన్ ట్యాపింగ్ చేసినం అనేది నువ్వే.. చేయలేదు అనేది నువ్వే.. సమంత.. నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అని అంతా కోడై కూస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం అనుమత్జి లేకుండా చేయరన్నారు. అనుమతి ఇచ్చేది ప్రభుత్వం.. ప్రభుత్వంలో అప్పుడు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అని ఆమె అన్నారు. విచారణలో అన్నీ తెలుస్తాయని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకి డబ్బులు పంపిన విషయం బయటకు వచ్చిందన్నారు. దాని మీద ఏం చేయాలి అనేది సీఎం.. విచారణ అధికారులు చూసుకుంటారన్నారు. కేటీఆర్ నోటీసు నాకు అందలేదని, వాట్సప్ లోనే చూశా అన్నారు. ఆయనని పొగిడినట్టే ఉంది.. నోటీసు లెక్క లేదు అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్‌కి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్, బీజేపీలు కైవసం చేసుకునేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి … కేసీఆర్‌కు ఓ బానిస, ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాటల మనిషే గాని చేతల మనిషి కాదన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు.
