Site icon NTV Telugu

Konda Surekha :స్మితా సబర్వాల్ పై కొండా సురేఖ స్పందన

Konda Suresha

Konda Suresha

సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వుండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ స్పందించారు. దివ్యాంగుల పై స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న మంత్రి.. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, పర్యవసనాలను ఆలోచించకుండా మాట్లాడటం తగదన్నారు. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందో దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.

Gally Gang Stars: ఎట్టకేలకు థియేటర్స్‭లో సందడి చేయబోతున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’..

శారీరక సామర్థ్యం కంటే మానసిక సామర్థ్యమే ముఖ్యమని స్మితా సబర్వాల్ గుర్తించాలని మంత్రి సురేఖ అన్నారు. గొప్ప సంకల్ప బలంతో శారీరక దుర్భలత్వాన్ని జయించి ఈ ప్రపంచానికి స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన మహోన్నత వ్యక్తులెందరో ఉన్నారనే విషయాన్ని స్మితా సబర్వాల్ గమనించాలన్నారు మంత్రి సురేఖ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో వివక్షకు తావులేదని, అన్ని వర్గాల హక్కులకు రక్షణ ఉంటుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

Kishan Reddy : అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదు

Exit mobile version