కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు.
Also Read:Rain Alert to Telangana : ఉరుములు, మెరుపుల వర్షాలతో పాటు ఈదురుగాలుల హెచ్చరిక
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ లకు కూడా మేడారం పనుల వ్యవహారాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ మంత్రి పెడుతున్న ఇబ్బందులను కొండా దంపతులు నివేదించినట్ల సమాచారం. తమ జిల్లాలో.. తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కొండా దంపతులు వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపైన కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ కలుగజేసుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
