తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న తరుణంలో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటన చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియంత పాలనను అంతం చేయడం బీజేపీకే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పై నమ్మకం లేదని.. కాంగ్రెస్ లీడర్ షిప్ దేశ వ్యాప్తంగా బలహీన మైందన్నారు. కానీ.. కాంగ్రెస్ కి తెలంగాణలో లీడర్ షిప్ ఉందని, తెలంగాణ లో బీజేపీ బలంగా అవుతుందన్నారు.
తెలంగాణ వాదులకు కేసీఆర్ డొక చేశారన్న విశ్వేశ్వర్‌రెడ్డి.. అయన పక్కన పువ్వాడ, సబిత, తలసాని లాంటి వాళ్ళు ఉన్నారంటూ విమర్శించారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తలు దోచుకోవడం తప్ప ఏమీ లేదని, ఆ పార్టీ తొందరలోనే ఖతం అవుతుందని, యాంటి కేసీఆర్ ఓటు బీజేపీకే వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కి అంత శక్తి లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నేను బీజేపీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏ రోజు నన్ను చేరమంటే ఆ రోజు చేరుతానని, కేసీఆర్ రాజకీయ తప్పిదాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.5 అంశాలపై బీజేపీని క్లారిటీ అడిగినట్లు తెలిపిన విశ్వే్శ్వర రెడ్డి.. రెండు అంశాలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారన్నారు.
