NTV Telugu Site icon

Komuravelle: పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య ఆందోళన..

Komarabelli

Komarabelli

Komuravelle: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడంలేదని భార్య మానస ఆరోపించారు. ఇద్దరి పిల్లల్ని దూరంగా ఉంచి నేను చనిపోయినట్టు చెప్పి దూరం పెట్టారన్నారు. వేరోక మహిళను పెళ్లి చేసుకున్నందుకే తనను దూరం పెట్టాడని ఎస్ఐ నాగరాజు భార్య ఆరోపిస్తున్నారు. తనకి న్యాయం చేసి తన ఇద్దరి పిల్లల్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట మానస ఆందోళనకి దిగారు.

Read also: Samantha: నువ్వు గెలవడం చూడాలనుంది.. సమంత షాకింగ్ పోస్ట్

మానస, నాగరాజు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కాగా.. సుమారు రెండేళ్ల క్రితం ఎస్‌ఐ నాగరాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మానసను వేధిస్తున్నాడు. తన మానసను, పిల్లలను కరీంనగర్‌లో ఉంచాడు. అయితే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. అప్పుడప్పుడు కరీంనగర్ కు వచ్చిపోయేవాడు. ఏమనిపించిందో ఏమోగానీ.. చివరకు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల క్రితం కరీంనగర్ వచ్చిన ఎస్ఐ బలవంతంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లు ఎక్కడున్నారో మానసకు చెప్పడం లేదు. అంతేకాకుండా.. విడాకులు ఇవ్వాలని వేధించడంతో మానస ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆమె సూసైడ్‌ నోట్‌ రాసింది.

Read also: Jharkhand : పాము కాటుతో చనిపోయిన తండ్రి.. బతికేందుకు కూతురి ప్రయత్నం

దీంతో కుటుంబ సభ్యులు కలగ జేసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆమె ఆత్మను విరమించుకుంది. అయితే.. ఈ విషయాన్ని సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్‌ మహిళా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. తనకు తమ ఇద్దరు పిల్లలకు ఎస్‌ఐ నాగరాజు, రెండో భార్యతో ప్రాణహాని ఉందని వాపోయింది. నాగరాజు.. పిల్లలు తనతో కలిసి ఉండేలా న్యాయం చేయాలని ఆమె మంగళవారం కొమురవెల్లి పోలీస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీస్టేషన్‌ సిబ్బంది ఎస్‌ఐ నాగరాజు సెలవులో ఉన్నారని చెప్పారు. అయితే.. మానస న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తానని పేర్కొంది. దీనిపై సీఐ శ్రీనును సంప్రదించగా.. విషయాన్ని మానస ఇటీవల తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
RGV : తమిళ హీరోతో ఆర్జీవి.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?

Show comments