ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత సీట్లు దొరకడం లేదని మహిళలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదుట వాపోయారు. మునుగోడు వద్ద ఆర్టిసీ బస్సు ఎక్కిన రాజగోపాల్ రెడ్డి మహిళలను పలకరించారు.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి మహిళల మధ్య ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందని…. ఫ్రీ బస్సు సౌకర్యం కంటే ముందు ఈ పరిస్థితి ఉండేది కాదని రాజగోపాల్ రెడ్డితో అన్నారు మహిళలు. పురుషులు ముఖ్యంగా యువకులు మహిళలకు బస్సులో సీట్లు ఇవ్వాలని కోరిన రాజగోపాల్ రెడ్డికి మహిళల నుండి ఊహించని సమాధానం ఎదురైంది.. టికెట్లు తీసుకున్న వారికి సీట్లు ఇవ్వకుండా వారిని ఎలా నిలబెడతామని ఎదురు ప్రశ్నించారు మహిళలు..
S Jaishankar :జార్జ్ సోరోస్ లేదా కిమ్ జోంగ్ ఉన్‌తో డిన్నర్.. జైశంకర్ రిఫ్లై అదుర్స్..