మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయానికి రోజుకు 15 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయట్లేదని రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ‘కరెంట్ ఇస్తున్నామని ఓ ఊదరగొడతం కాదు.. ఏ ఊరికైనా పోదాం.. మీరు చెప్పినట్లు కరెంట్ ఉంటే చూపించండి. నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మీకు చచ్చే వరకూ పదవులు కావాలి. మీరు చెప్పినంత కరెంట్ లేకపోతే కనీసం రైతులకు క్షమాపణ చెప్పాలి.’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు పదవులు కావాలి కానీ తమకు అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దళిత, బీసీ, మైనార్టీ బందులన్నీ కేసీఆర్ దుకాణం బంద్ కోసమే అంటూ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read : Kiran Abbavaram First Movie : ఎట్టకేలకు టీవీ లోకి వచ్చేస్తుందిగా..
అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో కాదని.. జనగామ, స్టేషన్ ఘనపూర్‌లో చూడండి తమకే తెలుస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకుపడ్డారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని రాజకీయం చేస్తే, తాము ప్రజల్ని నమ్ముకున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొంగర కలాన్ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు భవిష్యత్ భరోసా ఇవ్వబోతున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
Also Read : Baby Husband : పాపం బేబీ మొగుడుకి రియల్ లైఫ్‌లో దిమ్మతిరిగే షాక్..ఒకే సారి ఇద్దరితో డేటింగ్?