Site icon NTV Telugu

Komitreddy Venkat Reddy : కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు

Komatireddy

Komatireddy

Komitreddy Venkat Reddy : బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నదుల అభివృద్ధి , సంరక్షణ సంస్థ (NDSA) నివేదికలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన డొల్లతనం పూర్తిగా బహిర్గతమైందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు అబద్ధాలు చెప్పడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. నివేదిక ఆధారంగా తప్పిదాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ఎనిమిదో వింతే అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి.. మూడు సంవత్సరాల్లో నిర్మించి, రెండు సంవత్సరాల్లో కూలిపోయే ప్రాజెక్టు నిజంగానే ఎనిమిదో వింత అంటూ తీవ్రంగా విమర్శించారు. NDSA నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలు మన్నికలేకపోయాయని స్పష్టం అయ్యిందని అన్నారు.

బీఆర్ఎస్ నేతలకు దేవుడు నోరు ఇచ్చాడు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు పోలిక ఏమిటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీరు మళ్లించే పనిలో కెటీఆర్ ప్రమేయం ఉందని, అయితే కేటీఆర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు డిజైన్ చేశది కేసీఆర్ అని స్పష్టం చేశారు. నిర్మాణంలో నాణ్యత లోపాలకు కారణమైన అధికారులపై, సంబంధిత వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

KMC Hospital : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు అస్తవ్యస్తం..

Exit mobile version