కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. వచ్చే వారం ప్రధాన మంత్రితో సమావేశం అవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. మంత్రితోపాటు హాజరైన తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలు గా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని కోరారు. పలు రోడ్లు, భవనాలపై చర్చించారు.
READ MORE: Komatireddy : సినీ కార్మికుల జీతాలు పెంచాలి.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు !
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం గురించి ప్రయత్నాలు చేస్తున్నాం.. ప్లాన్స్ జరుగుతున్నాయన్నారు. పటౌడీ హౌస్ లో రెండు నెలల్లో పనులు మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో అనుమతుల కోసం కొంత ఆలస్యం అవుతోందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై మంత్రి స్పందించారు. “నేను మా సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో లేను. కేంద్ర పెద్దలు మాటిచ్చిన విషయం నాకు తెలియదు. నా చేతుల్లో ఏం లేదు. అధిష్టానం, ముఖ్యమంత్రి మంత్రి పదవుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఢిల్లీకి రాలేదు. మంత్రి పదవి అడగలేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు.
READ MORE: Rajagopal Reddy: ఎవరి కాళ్ళు మొక్కను.. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
