NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : ప్రాజెక్టు నిర్దిష్ట లక్ష్యంగా ఉన్న ఆయకట్ట భూములకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సాయుధ యోధులకు అమరవీరులకు నివాళులు.. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ వచ్చిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం రోజున సీతారామ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభం చేయడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో బిజీ కొత్తూరు సీతారామ పంప్ హౌస్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జన్మ ధన్యమైందన్నారు. ప్రాజెక్టు నిర్దిష్ట లక్ష్యంగా ఉన్న ఆయకట్ట భూములకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ₹10,000 కోట్లు చేయాల్సి ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Train Accident: మరో రైలు ప్రమాదం.. ఊడిపోయిన రెండు కోచ్‌లు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షలు రుణమాఫీ కొరకు 31 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు జమ చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు అంత సమిష్టిగా కృషితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. నల్గొండ, ఖమ్మం, భద్రాది ,ఈ మూడు జిల్లాల్లో 36 స్థానాలకు 32 స్థానాలు అధిక మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులను ఎంత ఖర్చయినా పూర్తి చేసి ప్రజల ఆశలు నెరవేరస్తామని ఆయన అన్నారు.

CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..