NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : దేశంలో ప్రజా దర్బార్ పెట్టని ఏకైక సీఎం కేసీఆర్

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించార భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఐటీ శాఖా మంత్రి కాదు… విదేశాంగ మంత్రి అంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని, దేశంలో ప్రజా దర్బార్ పెట్టని ఏకైక సీఎం కేసీఆర్‌ అని ఆయన విమర్శించారు. ఎంపీ హోదాలో అనేక సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వని వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమంటూ ఆయన ధ్వజమెత్తారు. దళిత, బీసీ, గృహా లక్ష్మి లబ్దిదారులు అంతా బీఆర్ఎస్ నేతలే.. కోర్టులో పోరాటం చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Also Read : KA Paul: చంద్రబాబు అరెస్ట్‌పై ఇలా స్పందించిన కేఏ పాల్.. ఏంటి? మీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌

ఉద్యోగులకు, పెన్షనర్ లకు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. నెల నెల జీతాలు ఇవ్వాలన్నారు. కేసీఆర్‌తో సహా ప్రజాధనాన్ని దోచుకున్న అందరినీ జైల్ కు పంపుతామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను జైల్ కు పంపితే.. రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి జగదీష్ రెడ్డి వట్టే జానయ్య పై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని, రేపటి నుండి నల్లగొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు కోమటిరెడ్డి. 55 శాతం ఓట్లే లక్ష్యంగా ఎన్నికల ప్రచారమన్నారు. నల్లగొండలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే… బీఆర్ఎస్ కార్యాలయం టౌన్ నుండి తరలిస్తామన్నారు. మినీ జమిలి ఎన్నికలు వస్తాయని, ఫిబ్రవరి, మార్చ్ లో ఎన్నికలు ఉండొచ్చన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోతే… ఏ క్షణంలోనైనా ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. నల్లగొండ జిల్లా నుండి కొత్త చేరికలు ఉండవు.. సీట్ల కంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Also Read : Poonam kaur: జైల్లో చంద్రబాబు..అది గుర్తు చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్!