నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాల బాత్రూమ్ కడుగుతుండే అంటూ వ్యాఖ్యానించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారన్నారు. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కాంట్రాక్టర్లు , రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండని, సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుంది కేసీఆర్…? అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్ లో ఎక్కువ మంది ఓసిలేనని, కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ మాత్రమేనన్నారు. పంట నష్టం పది వేల రూపాయలు ఏవి…? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Maskathadi: బార్ అండ్ రెస్టారెంట్‌లో ఐటెం సాంగ్ రిలీజ్
నాకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు.. నాకు బతుకు తెలంగాణ కావాలన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నాకు వ్యాపారాలు లేవు… గుట్టలు, కొండలు అమ్ముకొనని, గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించిండంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు ను కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేసిండని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మి దాంతో వచ్చిన డబ్బులతో ఖజానాలో ఉన్న లోటును పూడ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లకు అప్పగించిన కేసీఆర్.. వచ్చిన డబ్బుతోనే రైతు రుణమాఫీ చేశారన్నారు.
Also Read : Boora Narsaiah Goud : బీజేపీ హర్ ఘర్ తిరంగ అంటుంటే… కేసీఆర్ హర్ ఘర్ మద్యం సీసా అంటున్నారు
