9 సంవత్సరాల తర్వాత రాజభవనం లాంటి సెక్రటేరియట్ కట్టుకోని.. ఈరోజు కుర్చీలో కూర్చొని సంతకం చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ యాదాద్రి జిల్లా మోత్కూర్ పరిధి కొండగడపలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పేరుకు 1000 కోట్లు అంటున్నాడు.. 3వేల కోట్లతో రాజభవనం కట్టుకున్నాడని ఆయన ధ్వజమెత్తారు. నీకు రెండు చేతులతో దండం పెడుతున్న కేసీఆర్.. మంచి భవనం కూలగొట్టి సెక్రటేరియట్ కట్టుకున్నావ్ నంతోషమన్నారు.
Also Read : Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..
ఊర్లల్లో డబుల్ బెడ్ రూమ్ లు, పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా సెక్రటేరియట్ మాత్రం కట్టుకున్నావ్.. సెక్రటేరియట్ కి అంబెడ్కర్ పేరు పెట్టుకున్నావ్ సంతోషం…అంబేద్కర్ గారి ఆశయాలు అయిన అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తావని ఆశిస్తున్నా… ఇప్పటికైనా నువ్వు వాస్తు ప్రకారం కట్టుకున్న సెక్రటేరియట్ కి రోజు వస్తావని ఆశిస్తున్నాము….’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇప్పటికైనా వాస్తు ప్రకారం కట్టుకున్న సెక్రటేరియట్‌కి రోజు రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Also Read : Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం