NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్లక్ష్యానికి గురైంది

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మంత్రికి.. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూర్ జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. వరద బాధితుల కోసం 30టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి… అనంతరం గురుపూజోత్సవంలో పాల్గొన్నారు.

Smart Watches: ఈ స్మార్ట్ వాచ్‌లపై భారీగా తగ్గింపు.. తక్కువ ధరలో లభించే టాప్ 10 వాచ్‌లు!

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్లక్ష్యానికి గురైందన్నారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్ల క్రితమే యాదాద్రి ధర్మాలు పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేదని ఆయన తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం ఎన్ని కొట్లినా ఖర్చు చేసే పూర్తి చేస్తామని, నల్లగొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. మిర్యాలగూడకు పదివేల కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మంజూరు చేయిస్తానని, ఇంకా పది ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Jani Master: జానీ మాస్టర్‌ ఇష్యూ..ఇక నోరు విప్పకండి.. డ్యాన్సర్లకు వార్నింగ్‌

Show comments