Komatireddy Venkat Reddy : ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. UPSC తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తామని, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, NG కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేసి మాట్లాడారునల్గొండ ప్రజలు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు .. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాలను అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఇప్పటికే 10 లక్షల రూపాయలకి పెంచామని.. మిగతా గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!