Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : మీ వెంట ఉండే టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ ప్రేమతో లేరు

Komatireddy

Komatireddy

తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఈ ఉప ఎన్నిక బరిలో ఉన్న నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే తాజాగా.. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 8 యేండ్లలో లక్షల రుపాయలు దోపిడీ చేసింది వాస్తవం కాదా..? పదవి త్యాగం చేసిన నన్ను ఓడించాడనికి 100 మంది ఎమ్మెల్యే ల ని పెట్టి డబ్బులు గుమ్మరించి నాయకులని కొంటున్నావ్. ఒక్క వ్యక్తి ని ఓడించాడని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగణ్ణి వాడుకుంటున్నావన్న సంగతి ప్రజలు గ్రహించారు. అనవసరంగా మీరు దుససాహసం చేస్తున్నారు. ప్రలోబాలతో పెట్టే రాజకీయాన్ని ఎవరు నమ్మరు. అలాట్ అయిన రోడ్డు రోలర్ గుర్తు ను మార్పించారు. సీఎం కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు అస హెయ్యిచుకుంటున్నారు. మీ వెంట ఉండే టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరు ప్రేమ తో లేరు. ఏ రోజైతే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడో ఆ రోజే కాంగ్రెస్ పని అయిపోయింది.

Also Read : Big Breaking : ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల

అప్పుల తెలంగాణను గాడిలో పెట్టాలంటే బీజేపీకే సాధ్యం. మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. మేము కుటిల రాజకీయాలు చేస్తున్నామని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈ మూడు నెలల్లో డబ్బులు ఇవ్వకుండా ఈ మునుగోడులో ఎవరైనా టీఆర్‌ఎస్‌లో చేరారా. మీ అవినీతి సొమ్ము పెట్టి నాయకులను కొనండి… ప్రజలు మాత్రం మా వైపు ఉన్నారు. మేము ఎన్నికల ప్రచారం చేస్తుంటే వచ్చి అడ్డుకుంటున్నారు… మీరు ప్రజలకు ఏం చేసారో ప్రచారం చేసుకోండి అంతే కానీ మేము ప్రచారం చేస్తుంటే అడ్డుకోవడం కాదు. బీజేపీకి ఓటేస్తే పింఛన్ రాదు, రైతు బంధు రాదు అని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గ్రామాలలో బెదిరింపులకు దిగుతున్నారు.
హుజురాబాద్ లో ఇలాగే బెదిరించారు.. ఇపుడు అక్కడ పింఛన్లు వస్తున్నాయి. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే 3000 రుపాయలు పింఛన్ ఇస్తాము. మునుగోడు హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్న అభివృద్ధి కి నోచుకోలేదు. చౌటుప్పల్ లో మిషన్ భగీరద నీళ్లు రావట్లేదు. ఎవ్వరు కూడా మునుగోడు నియోజకవర్గం లో మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదు. నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్ట్ లన్ని ఆగిపోయాయని ఆయన అన్నారు.

Exit mobile version