ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు మేనియా నడుస్తోంది. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే తాజాగా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డ నామినేషన్ వేశారు. అయిఏ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం వేసిన నామినేషన్‌లో భాగంగా ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో జత చేశారు. ఈ అఫిడవిట్ ప్రకారం కోమటిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తెలుస్తోంది.
తనకు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్నట్లుగా కూడా వెల్లడించారు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా…చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. తన సతీమణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 3న పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగనుంది.
