MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవితపై తీవ్ర విమర్శలు
- కవిత పార్టీ ఏర్పాటు “బిగ్ జోక్” అని వ్యాఖ్య
- TRS పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని అభిప్రాయం
- కవితకు స్వతంత్ర నాయకత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలపై స్పందిస్తూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ ఏర్పాటు విషయాన్ని రాజగోపాల్ రెడ్డి “బిగ్ జోక్”గా అభివర్ణించారు. అదే విధంగా TRS పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని వ్యాఖ్యానించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడు బిడ్డగా మాత్రమేనని, ఆమె స్వతంత్ర రాజకీయ నాయకత్వం ఇంకా నిరూపించుకోలేదని అన్నారు.
మొదటి సమావేశంలోనే తన తండ్రి అయిన కేసీఆర్‌ను విమర్శించడం సరైంది కాదని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తండ్రిపై గౌరవం, ప్రేమ ఉండాలని, అలాంటి విలువలు లేకపోతే ఆమె వ్యక్తిత్వం ప్రశ్నార్థకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. “తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది” అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అలాగే కవిత అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపడం సరికాదని అన్నారు. కుటుంబ సమస్యలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు. కవితపై ఉన్న మద్యం కుంభకోణం ఆరోపణల విషయమై.. ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, నిర్దోషి అని తేలలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం డబ్బులు ఉన్నాయనే కారణంతో పార్టీ పెట్టడం అంత సులువు కాదని, అది పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు.
తనంతట తాను పోటీ చేసినా కవితకు డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, అధిష్టానం తనకు పెద్ద పదవి ఇస్తే ఆ బాధ్యతను న్యాయంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!