NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుంది..

Komatireddy

Komatireddy

కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని, 2 లేదా 3 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) చేపడుతున్నారని ప్రశ్నించారు. దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా మోదీ మాట్లాడటం బాధాకరమని చెప్పారు.మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమికే( INDIA Alliance ) ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర భారత్ లో బీజేపీ పరిస్థితి బాగలేదన్న మంత్రి కోమటిరెడ్డి అందుకే దక్షిణ భారత్ పై ఫోకస్ పెట్టారని తెలిపారు.బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్న ఆయన తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని తెలిపారు. నల్లొండ , భువనగిరిలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రచారం చేసిన కూడా డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పటికైన, కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకొవాలని హితవు పలికారు. అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డిపై కూడా మంత్రి కోమటి రెడ్డి మండిపడ్డారు.