Site icon NTV Telugu

Komati Reddy : నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా

Komati Reddy Venkatreddy

Komati Reddy Venkatreddy

Komati Reddy : తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను బరిలోకి దిగితే ప్రజలు తనను కచ్చితంగా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28వ తేదీన నల్గొండలోని ఎంజీయూలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించే నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్నారు. ఈరోజు ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఆ సమాచారాన్ని అందించారన్నారు. జూన్ మొదటి వారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నల్లగొండకు చేరుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంలో భారీ సభ ఏర్పాటు చేస్తామని.. దానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. బుల్డోజర్ పాలిటిక్స్ బంద్ అయ్యేలా రాహుల్ పాలన ఉండబోతుందన్నారు కోమటిరెడ్డి. నాయకుడు అంటే స్వార్థం లేకుండా పాదయాత్ర చేసేవాడే నాయకుడు ఆయనే రాహుల్ గాంధీ అన్నారు.

Read Also: IPL 2023 : ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్.. గుజరాత్ వర్సెస్ లక్నో ఢీ

రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే అనార్హత వేటు వేసిందన్నారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ముస్లింలు, దళితులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి..ఇవ్వాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను 20 ఏళ్లుగా నిజాయితీగా పని చేసి.. నల్గొండను అభివృద్ధి చేశానని, ఆపదలో ఉన్నవారందరికీ సేవ చేశానని చెప్పారు. అయితే వెంకటరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. పలుమార్లు ప్రధాని మోదీని ఆయన కలవడంతో కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ అద్దంకి దయాకర్ వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో చేరరని కాంగ్రెస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

Read Also:Virupaksha: సుప్రీమ్ హీరో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టాడు…

Exit mobile version