Sai Kumar : టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కు ప్రఖ్యాత కొమరం భీమ్ పురస్కారం దక్కింది. సాయి కుమార్ టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. అప్పట్లో పెద్ద హీరోలకు వాయిస్ అందించారు. ఇతర భాషల హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాంటి సాయి కుమార్ ను 2024 సంవత్సరానికి గాను కొమరం భీమ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, ఐఏఎస్ పార్థసారథి, కో చైర్మన్ నాగబాల సురేష్ కుమార్, కన్వీనర్ సోనే రావు ప్రకటించారు. ఇప్పటి వరకు సాయికుమార్ సినీరంగంలో చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందజేస్తున్నామన్నారు.
Read Also : Katrina Kaif : పిల్లలు పుట్టాలని స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు
మార్చి 23న ఈ అవార్డును స్థానిక ఎమ్మెల్యే కోవాలక్ష్మీ, గిరిజన సంఘాల నాయకులు, ఇతర స్థానిక నాయకులత సమక్షంలో సాయికుమార్ కు అందజేస్తామన్నారు. ఈ అవార్డుతో పాటు రూ.50వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. గతంలో సుద్దాల అశోక్ తేజ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు గూడ అంజయ్యకు కూడా అవార్డు అందజేసినట్టు వారు వివరించారు. ఇప్పుడు సాయికుమార్ కు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
Read Also : CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన మోహన్ బాబు, దిల్ రాజు