NTV Telugu Site icon

Suriya : మరోసారి విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే

Suriya

Suriya

Suriya : : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి సూర్య బయటకు వచ్చాడు. శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగువ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. సినిమాకు అన్ని చోట్ల తగిన రెస్పాన్స్ రాలేదు. తమిళ తంబీలు ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నా కూడా అవి ఏ మాత్రం నెరవేరలేదు. కంగువ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ బజ్ ఏర్పడింది. కార్తీక్ సుబ్బారాజ్ మేకింగ్ స్టైల్ కి కోలీవుడ్ లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతని సినిమా ల్లో మాస్ యాక్షన్ కూడా బలమైన ఎమోషన్ ఉంటుంది. సూర్య 44 సినిమాకు కూడా అదే ప్లస్ అయ్యేలా ఉందంటున్నారు.

Read Also:Arogyashri: తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు..

‘రెట్రో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే సూర్య తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. ఆర్‌జె బాలాజీ డైరెక్షన్‌లో సూర్య తన కెరీర్‌లోని 45వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య హీరోగానే కాకుండా విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇలా ఒకేసారి హీరోగా, విలన్‌గా సూర్య నటించడం ఇదేమి కొత్త కాదు. గతంలో ‘24’ చిత్రంలోనూ సూర్య ఇదే తరహా పాత్రల్లో నటించాడు. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.

Read Also:Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు పొందండి!

Show comments