Site icon NTV Telugu

Drugs Brust: కోలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం నటి అరెస్ట్!

Drugs

Drugs

Drugs Brust: తమిళ సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ, తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు, యశ్వంత్, శ్రీరామ్, అల్విబిన్షా, వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Limited Edition : Xiaomi 65 ఇంచుల Smart TVపై రూ.32,000 భారీ తగ్గింపు.. డీల్ సెల్లింగ్ ఫాస్ట్.!

నిందితుల వద్ద నుండి పోలీసులు 6 గ్రాముల మెతాంఫేటమైన్ (మెత్), 7 గ్రాముల ఓజీ గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, ఎల్‌ఎస్‌డీ స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!

Exit mobile version