NTV Telugu Site icon

IPL 2024 Final: అదరగొట్టిన కేకేఆర్ బౌలర్లు.. కుప్పకూలిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు

Kkr

Kkr

ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్కతా బౌలింగ్కు సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 18.3 ఓవర్లలో ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఆదుకుంటాడనకున్నప్పటికీ (9) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

Read Also: Aa Okkati Adakku : ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ (20) పరుగులతో సెట్ అవుతున్నాడనుకునే సరికి రస్సెల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయి వెనుదిరిగాడు. నితీష్ కుమార్ రెడ్డి (13), ఇక ఆశలన్నీ క్లాసెన్ పైనే అనుకున్నప్పటికీ (16) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత షాబాజ్ అహ్మద్ (8), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అబ్దుల్ సమద్ (4) పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ కమిన్స్ (24) పరుగులు చేయడంతో జట్టు 113 పరుగులు చేయగలిగింది. ఫైనల్లో కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మొదట్లోనే కీలక వికెట్లు హెడ్, అభిషేక్ శర్మ వికెట్లు తీశారు.

Read Also: Road Accident: నోయిడాలో కారు బీభత్సం.. గాల్లో ఎగిరిపడ్డ వృద్ధుడు

కేకేఆర్ బౌలర్లు అందరూ వికెట్లు తీసి స్కోరును కట్టడి చేయగలిగారు. కేకేఆర్ బౌలింగ్లో రస్సెల్ 3 కీలకమైన వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్టార్క్ కీలక 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా ట్రేవిస్ హెడ్ వికెట్ తీశాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సంపాదించారు.