Kolkata Rape Case: దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా కేసు. ఇక ఇందుకు సంబంధించి మంగళవారం (ఆగష్టు 20)న సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ జరగనుంది. ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం కోర్ట్. ఇక మరోవైపు డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సీబిఐ విచారణ కూడా జరుగుతుంది. ఇక RG కార్ మెడికల్ కాలేజి మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్ ను వరుసగా నాలుగో రోజు సీబిఐ విచారిస్తోంది. అలాగే.. నిందితుడు సంజయ్ రాయ్ కి సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ టెస్ట్ ముగిసింది.
Child Rape: ఛీ.. ఛీ.. మనిషా.. లేక మృగమా..? మూడేళ్ళ చిన్నారి పై అత్యాచారం..
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కొన్ని కధనాల ద్వారా తెలుస్తోంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు తర్వాత ఇప్పుడు అవి వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. నివేదికల ప్రకారం, ఈ కేసులో సీబీఐకి షాకింగ్ సమాచారం అందింది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో.. ఆస్పత్రిలో అక్రమంగా మానవ అవయవాల వ్యాపారం జరుగుతోందని, మృతుడికి మద్దతిస్తున్న వైద్యుల వాంగ్మూలాలను బట్టి సీబీఐకి తెలిసింది. విచారణలో 23 సంవత్సరాల క్రితం 2001లో జరిగిన కాలేజీ విద్యార్థి మరణానికి లింకులు కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాలేజీలో సెక్స్, డ్రగ్స్ రాకెట్ కూడా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సీబీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
India Day Parade: అంగరంగ వైభవంగా న్యూయార్క్ లో ‘ ఇండియా డే పరేడ్ ‘ వేడుకలు..
