NTV Telugu Site icon

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ… కేకేఆర్ టార్గెట్ ఎంతంటే ?

ఐపీఎల్‌ 2021 క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌ లో భాగంగా ఇవాళ కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ మరియు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో టాస్‌ ఓడి… మొదట బ్యాటింగ్‌ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్‌ జట్టు ఘోరంగా విఫలమైంది. 20 ఓవరల్లో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి.. కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్‌ ధావన్‌ 36 పరుగులు , శ్రేయస్‌ అయ్యర్‌ 30 పరుగులు, మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

షా 18 పరుగులు, స్టోయినీస్‌ 18 పరుగులకే వెనుదిరిగారు. దీంతో కేకేఆర్‌ ముందు 136 పరుగుల లక్ష్యాన్నే ఉంచగలిగింది ఢిల్లీ జట్టు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి ఏకంగా 2 వికెట్లు తీసి… ఢిల్లీ కి షాక్‌ ఇచ్చాడు. కాగా..ఈ మ్యాచ్‌ లో కేకేఆర్‌ గెలవాలంటే.. 20 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి ఉంది. మరికాసేపట్లోనే కేకేఆర్‌ ఛేజింగ్‌ ప్రారంభం కానుంది.