West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని చోర్‌బగాన్ సార్వజనీన్ దుర్గాపూజ పండల్లో మహాసప్తమి రోజున జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కురుస్తున్న సమయంలో పూజ నిర్వాహకులు చేసిన ఒక ప్రకటన కారణంగా జనం ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వారి వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యంతో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read
- YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
- CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
- General Syed Amar Raza: "పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం".. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
శాంతిభద్రతల నిర్వహణలో విఫలమైన పూజ కమిటీ సభ్యులు, పోలీసులు లేదా సెక్యూరిటీ గార్డులు ఎవరినీ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పీఎంఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధాని కార్యాలయం (PMO) ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాధితులను ఆదుకోవడానికి చర్యలు చేపడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంతో కోల్‌కతాకు రావలసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఘటన స్థలం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, బాధ్యులైన వారిపై విచారణ వేగవంతం చేశారు. రద్దీగా ఉన్న ఇతర పూజ పండళ్లను కూడా ముందస్తు జాగ్రత్తగా తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
తాజావార్తలు
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!