NTV Telugu Site icon

Kolikapudi Srinivas : కేసీఆర్ గతంలో ఎన్నో‌ మాటాలు మాట్లాడారు.. ఇప్పుడు ఏమైంది

Kolikapudi Srinivas

Kolikapudi Srinivas

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తుపల్లి కాదు ఇది సత్తాపల్లి అని కొనియాడారన్నారు. సత్తుపల్లి‌కి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫీల్ అవుతున్నానని, సత్తుపల్లి తెలుగుదేశం ప్రజలు తలుచుకుంటే ఎక్కడైనా గద్దె ఎక్కోచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కార్యకర్తలకంటే మన తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ పని చేశారని, నేను ఆంధ్రప్రదేశ్ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి గా వచ్చానని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలో‌ తెలుగుదేశం కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చిన నేను ముందు ఉంటానని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా..’కేసీఆర్ గతంలో ఎన్నో‌ మాటాలు మాట్లాడారు.. ఇప్పుడు ఏమైంది… నాలుగు రోజుల తరువాత కేసీఆర్ అనే నాయకుడు ఉన్నాడు అని చెప్పుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు వచ్చింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి గా తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న.. అందరి సహకారం నాకు కావాలి. తెలంగాణలో నాయకులు అందరూ పార్టీ ని వదిలేసిన కార్యకర్తలు పార్టీ ని వీడలేదు. తెలంగాణ ఎన్నికల్లో మన తెలుగుదేశం మద్దతునే ప్రభుత్వం ఏర్పాటు చేశారు అంటే మన కార్యకర్తల బలం ఎంటో అర్దం అవుతుంది. తిరూవూరు లో నాకు బ్రహ్మారధం పడుతున్నారు…తిరువూరు చరిత్రను తిరగరాసే అదృష్టం నాకు దక్కింది.. తిరువూరు ఎలక్షన్ మన ఎలక్షన్ అని సత్తుపల్లి తెలుగుదేశం కార్యకర్యలు పనిచేయ్యాలి. సత్తుపల్లి తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే గెలుపు సాద్యం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఆంద్రలో ఉన్న మీకు ఉన్న పరిచయ వ్యక్తులతో మాట్లాడండి. తిరూవూరు లో నేను మూప్పై వేల మెజారిటీతో గెలవబోతున్న అంటూ జోస్యం చెప్పుకున్నారు. రాజధాని లేకుండా పాలన చేసిన వ్యక్తి జగన్..రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్ ఆర్ పార్టీ అని విమర్శలు చేశారు.

 

తిరువూరు లో గతంలో తెలుగుదేశం అభ్యర్థి స్వామిదాస్ ఓటమికి కారణం స్వామిదాస్ నే… 550 పోస్టల్ బ్యాలేట్స్ ఇంట్లోనే పెట్టుకోని 250 ఓట్లతో ఓటమి పాలైనారు. నైతికంగా అక్కడ వైసిపి గెలుపు కోసం స్వామిదాస్ పని చేశారు. గతంలో నాలుగుసార్లు తిరువూరు లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది…కానీ అక్కడ పార్టీ కాదు ఓడింది అభ్యర్థి. తిరువూరు నియోజకవర్గం లో 20 సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది..మరో 20 సంవత్సరాల పునాది వేస్తాను. 2018 లో కేసీఆర్ గెలవటానికి కారణం ప్రతిపక్షలు రెడీగా లేకపోవటం వలనే కేసిఆర్ గెలిచాడు. తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం…కాంగ్రెస్ గెలిపించిన తెలుగుదేశం పార్టీ. తిరువూరు లో తెలుగుదేశం అభ్యర్థి కోలికపూడి శ్రీనివాస్ గెలుపు కోసం ఆంద్రలో ఉన్న బంధువర్గానికి మిత్రులకు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ లో తెలుగుదేశం ఓట్లతో గెలిచిన ఖమ్మం జిల్లా మంత్రులు ఎలా మీ దగ్గరకు వచ్చారో అలానే నేను గెలిచిన తరువాత మీదగ్గరకు వస్తాను మీతోనే ఉంటా.’ అని ఆయన అన్నారు.