NTV Telugu Site icon

Donkey Attack on Man: వ్యక్తిపై గాడిద దాడి.. కాలుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ..

Donkey Attack On Man

Donkey Attack On Man

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రజలను ఓ వీడియా చక్కర్లు కొడుతూ భయపెడుతుంది. ఇంతకీ.. ఏం జరిగిందంటే.. ఒక గాడిద ఉన్నట్టుండి ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే.. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే కనిపిస్తాయి. కానీ.. కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియోలోని గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేసింది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా.. అది సదరు వృద్ధునిపై దాడిని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Read Also: Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదు

ఈ ఘటన నిన్న ( శుక్రవారం) ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. ఈ వీడియోలో.. ఒక వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తు్ండటం కనిపిస్తుంది. ఆ టైంలో రోడ్డు పక్కన నిలబడిన ఒక గాడిద ఉన్నట్టుండి, ఆ వృద్ధుడి వైపు పరిగెత్తకుంటూ వచ్చి.. అతనిపై దాడికి దిగింది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన నోటితో కొరుకుతూ.. కాళ్లతో తొక్కివేయడం వీడియోలో మనం చూడొచ్చు. వృద్ధుడిపై గాడిద దాడి చేయడం గమనించిన చుట్టుపక్కల వారు అతడ్ని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంది. తరువాత ఒక వ్యక్తి దానిపైకి రాయి విసిరినా అది ఏమాత్రం భయపడకూండా వృద్ధుడిని గాయపరుస్తుంది.

Read Also: Rajasthan Kota: రాజస్థాన్‌ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇప్పటికే 15 మంది ఆత్యహత్య చేసుకున్నారు

దీంతో మరికొందరు కర్రతో దాన్ని కొట్టడంతో ఆది.. వారి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు. అయితే.. గడచిన మూడు రోజుల్లో జంతువుల కారణంగా దాడి జరగటం ఇది రెండవసారి. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాల పాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Show comments