NTV Telugu Site icon

Kolagatla Veerabhadraswamy: జగన్ అంటే భయంతోనే ఈ దాడులు.. పిరికిపంద చర్య

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy

అంబేద్కర్ జయంతి ముందు రోజు సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఇది చేతకానితనం వల్ల చేసే పిరికిపంద చర్యగా చెపుతున్నామన్నారు. ఇలాంటి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ అంటే భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ బలం లేక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నారని.. జగన్ కి జనం నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి తట్టుకోలేక దాడులు చేస్తున్నారని వీరభద్రస్వామి పేర్కొన్నారు.

Read Also: CM Jagan Stone Incident: సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు..

భగవంతుడు జగన్ వెనుక ఉన్నాడు కనుక ఆయన కంటికి ఏమి కాలేదని తెలిపారు. కూటమి.. ఎన్నికల్లో ఎన్ని కుయక్తులు పన్నిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని డిప్యూటీ స్పీకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి యుత వాతావరణం చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. ఎన్ని దాడులు చేసిన సీఎం యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అటు సీఎం జగన్ పై దాడిని పలువురు నేతలు ఖండించారు.

Read Also: Manifesto BJP: బీజేపీ లోక్‌సభ మ్యానిఫెస్టోపై ఆరోపించిన విపక్షాలు..!

ఇదిలా ఉంటే.. మరికాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సీఈఓను కలవనున్నారు. జగన్ పై నిన్న జరిగిన దాడి పై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరునున్నారు.