HMDA Land Auction: కోకాపేట నియో పోలీస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఈరోజు (డిసెంబర్ 3న) ప్లాట్ నంబర్స్ 19, 20లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు. అయితే, ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి 131 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరానికి 118 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. కాగా, ఈరోజు 8.04 ఎకరాలకు గాను సుమారు వెయ్యి కోట్ల రూపాయలను HMDA పొందింది. ఇక, మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు 3,708 కోట్ల రూపాయలను HMDA ఆర్జించింది. అయితే, ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఈ వేలం వేసింది. కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాల భూమికి వేలం వేస్తున్నారు. కోకాపేట గోల్డెన్ మైల్ లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు డిసెంబర్ 5వ తేదీన ఈ వేలం వేయనున్నారు.
Read Also: IND vs SA T20: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఇదే భారత జట్టు!
అయితే, హెచ్ఎండీఏ భూముల వేలంలో కాసుల పంట పండింది. ప్లాట్ నెంబర్ 19ను ఎకరాకు 131 కోట్ల రూపాయల విలువతో YULA కన్స్ట్రక్షన్స్ LLP, గ్లోబస్ ఇన్ఫ్రాకాన్ LLP సంస్థలు పొందాయి. అలాగే, ప్లాట్ నెంబర్ 20లో ఎకరాకు 118 కోట్ల రూపాయలకు బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ దక్కించికుంది. కాగా, నియో పోలీస్ ఈ-ఆక్షన్‌లో సుమారు 3,700 కోట్ల రూపాయల మైలురాయిని దాటి, సగటు స్థల విలువల్లో అసాధారణ వృద్ధి సాధించింది. మూడు దఫాలుగా నిర్వహించిన ఆక్షన్‌ల ద్వారా ఇప్పటి వరకు కలిపి మొత్తం 3, 708 కోట్ల ఆదాయాన్ని హెచ్ఎండీఏ ఆర్జించింది.
