Virat Kohli: కింగ్ కోహ్లీ 35వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. కింగ్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయనున్నారు. అదే రోజు భారత్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ కూడా ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా.. కోహ్లీ పుట్టినరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also: Alekhya Harika: నక్క తోక తొక్కిన అలేఖ్య హారిక!
మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడులను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది. విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం భారత అభిమానులు చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
Read Also: Nadendla Manohar: హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?
ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు. కాగా.. ఈ జాబితాలో క్వింటన్ డి కాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్వింటన్ డి కాక్ 6 మ్యాచ్‌ల్లో 71.83 సగటుతో 431 పరుగులు చేశాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, ఐడెన్ మార్క్రామ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ఐదో స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఆరో స్థానంలో ఉన్నారు.