NTV Telugu Site icon

IND vs NZ Final: క్రిస్ గేల్ రికార్డ్ పై కోహ్లీ కన్ను.. మరో 46 పరుగులు చేస్తే ఛాంపియన్ ట్రోఫీలో నయా హిస్టరీ

Kohli

Kohli

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 భారత్- కివీస్ జట్ల మధ్య జరుగనున్నది. మార్చి 9న ఇరు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కొత్త హిస్టరీని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. క్రిస్ గేల్ రికార్డ్ పై కన్నేసిన కోహ్లీ.. మరో 46 పరుగులు చేస్తే ఛాంపియన్ ట్రోఫీలో చరిత్ర సృష్టించనున్నాడు.

Also Read:Women’s Day: “మహిళలు ఒక హత్య చేస్తే శిక్షించవద్దు”.. రాష్ట్రపతికి సంచలన లేఖ..

ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ 46 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ మాత్రమే ముందున్నాడు. గేల్ 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 17 మ్యాచ్‌ల్లో 746 పరుగులు చేశాడు. అంటే ఫైనల్లో 46 పరుగులు చేసిన వెంటనే కోహ్లీ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో మహేలా జయవర్ధనే ఉన్నాడు. అతను 22 మ్యాచ్‌ల్లో 742 పరుగులు చేశాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ పాకిస్తాన్ (100*), ఆస్ట్రేలియా (84) లపై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీకి ఈ రికార్డును బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

Also Read:Posani Krishna Murali: పోసానికి మరో షాక్‌.. 20వ తేదీ వరకు రిమాండ్‌

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

Also Read:Singer Kalpana: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన సింగర్ కల్పన.. వారిపై ఫిర్యాదు

ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విలియం ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ డఫీ, కైల్ జామిసన్