ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఉప్పల్ వేదికగా మే 18న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో బెంగళూరు జట్టు తలపడనుంది. ఇప్పటికే ఆర్సీబీ ప్లేయర్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే డుప్లేసిస్ సేన ప్రాక్టీస్ లో మునిగిపోయింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆ టీమ్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు.
Also Read : Karnataka Politics: సిద్ధరామయ్య, డీకే శివకుమారే కాదు.. సీఎం పోస్టుకు పెరుగుతున్న పోటీ..
అయితే మహ్మద్ సిరాజ్ ఇటీవలే ఫిల్మ్ నగర్ లో కొత్త ఇంటిని నిర్మించాడు. తన నూతన గృహ ప్రవేశానికి విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ తో పాటు సహాచర ఆటగాళ్లను సిరాజ్ ఆహ్వనించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లు సిరాజ్ కొత్త ఇంటిని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీతో పాటు అనుష్క శర్మ కూడా సిరాజ్ కొత్త ఇంటిని సందర్శించేందుకు వెళ్లినట్లు మనం చూడవచ్చు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఈ సంవత్సరం టోర్నమెంట్ లో 12 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. కేవలం 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఆర్సీబీ టీమ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.
Also Read : May sentiment: ఆ ఇద్దరికీ దెబ్బేసిన మే నెల!
