కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం రండి రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదాండరాం మాట్లాడుతూ.. అందరం కలిసి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. కానీ కేసీఆర్ మాత్రం నా ఒక్కోడి వాల్లే వచ్చిందని చెప్పుకుంటున్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ కారుడు ఖరీం అత్మబలిదానం తరువాతే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అంటూ ఆయన చెప్పారు.
Read Also: Health Tips: విరిగి చెట్టు.. తగ్గని వ్యాధులకు తగిన ఔషధం
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని పోరాటాలు చేశామని ప్రొఫెసర్ కోదాండరాం అన్నారు. నేడు తెలంగాణ కాంట్రాక్ట్ కమిషన్ల కోసం, దుర్మార్గపు పాలనని కేసీఆర్ రాష్ట్రంలో కోనసాగిస్తున్నారు.. నీళ్ల కోసం, నిధుల కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడేందుకు ప్రజలు మరో ఉద్యమానికి సిద్దం కావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. సమస్యలని పరిష్కారించాలని అడుగుతే కేసులతో భయందోళనకి గురి చేస్తున్నారు.. ప్రజల ఆకాంక్షల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోదాండరాం అన్నారు.
Read Also: Nipah Virus: అసలేంటి “నిపా వైరస్”.. దీనికి చికిత్స ఉందా..?
తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించలేని స్థితిలో నేడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని ప్రోఫెసర్ కోదాండరాం తెలిపారు. ఉద్యమాలకి ఊపిరి పోసింది కామారెడ్డి గడ్డ అని.. కామారెడ్డిలో ప్రజలందరు, ఉద్యమకారులందరూ ఏకమై కేసిఆర్ ని నిలధీయాలని చెప్పారు. తెలంగాణ కోసం కోట్లాడిన వారు ప్రజల బాగోగులు అడిగినరు తప్ప.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వుమని, కమిషన్లు ఇవ్వుమని అడుగాలేదు.. కేసిఆర్ తో బీజేపీ కుమ్మకై ప్రజలని మోసం చేస్తున్నారు అని కోదాండరాం పేర్కొన్నారు.
Read Also: SL vs PAK: కొలంబోలో భారీ వర్షం.. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ మరింత ఆలస్యం..!
మనం కొట్లాడితెనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. అ తెలంగాణలో కేసీఆర్ గద్దే మీద కుర్చున్నాడు.. మళ్లీ మనమంత కొట్లాడి కేసీఆర్ ని గద్దే దించే సమయం అసన్నమైంది.. కేసీఆర్ కామారెడ్డిలో ఆరంభం ప్రారంభమైంది.. షబ్బీర్ అలీ తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి.. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇబ్బందులకి గురి చేస్తున్నాడు.. సమస్యల ప్రతిపాదికన మనమంత ఏకమై కొట్లాడాలి.. 21వ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తి చేయలేదు అని ఆయన తెలిపారు. మార్పు కోసం ప్రతి ఒక్కరం ఐక్యంగా ఉండి పోరాడుదాం.. పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు చూసి విసుగు చెందారు.. కేసీఆర్ ని ఫాం హౌజ్ కి పంపే రోజులు దగ్గరకి వచ్చాయని ప్రోఫెసర్ కోదాండరాం అన్నారు.