NTV Telugu Site icon

TS Politics: నేడు ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం..

Ts Mlcs

Ts Mlcs

నేడు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల చేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేటి ఉదయం 9. 30 గంటలకు శాసనసభ మండలి ఛైర్మన్ కార్యాలయంలో జరుగనుంది. అయితే, నిన్న (సోమవారం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు మండలికి వెళ్లిన ప్రొఫెసర్​ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. చివరకు ప్రమాణం చేయకుండానే వీరు ఇరువురు వెనుదిరిగి వెళ్లిపోయారు. మండలి చైర్మన్ ​కు సమాచారం ఇవ్వకుండా రావడం వల్ల ఇలా జరిగిందన్నారు.

Read Also: Virat Kohli: కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. బ్యాట్‌తో కొడతానని బెదిరించా! దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

అయితే, శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డితో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లు ఫోన్​లో సంప్రదించినా ఆయన టచ్​లోకి రాలేదని చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.. ఈ క్రమంలోనే మండలి చైర్మన్​ అందుబాటులో లేరని టాక్. దీంతో ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామనే విషయాన్ని చైర్మన్ కు చేరవేయాలని మండలి సెక్రటరీకి ఎమ్మెల్సీలు వెల్లడించారు. అయితే, గురువారం ప్రమాణానికి ఏర్పాట్లు చేసేలా చూడాలని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అధికారులకు సూచించినట్లు సమాచారం.