తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలే చేశారని, కానీ కేసీఆర్ కుటుంబం.. సెంటిమెంట్ ని వాడుకున్నది.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు సీనియర్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు.. గ్యారంటీలు అమలు చేస్తాం అన్నామని ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. ధాన్యంకి ఐదు వందల బోనస్ ఎక్కడా..అని ఓ మాజీ మంత్రి అడుగుతున్నారన్నారు. 2600 క్విటాలుకు ధాన్యం అమ్ముతున్నారు రైతులు అని, Msp కంటే తక్కువ వస్తే బోనస్ ఇస్తాం అన్నామన్నారు. Msp రైతులకు వస్తుందని, రైతు రుణమాఫీ మీలాగా మేము చేయమన్నారు. రుణమాఫీ విషయంలో.. మాకే అనుభవం ఉందని, ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర మాది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఒకే సారి రుణమాఫీ చేస్తామన్నారు. అప్పుల వివరాలు సేకరించి పనిలో ఉన్నది మా ప్రభుత్వమని కోదండరెడ్డి అన్నారు.
Kiss Day 2024: ముద్దుతో లాభాలు.. ఈ మాత్రం హింటిస్తే చాలు, కుర్రాళ్లు రెచ్చిపోతారు..
Hmda లో చిన్న అధికారి ని పట్టుకుంటే.. ఐఏఎస్‌ల పేరు చెప్తున్నారని, కోట్లు ఇచ్చినట్టు చెప్పారన్నారు. ఈ శాఖ కేటీఆర్ దగ్గరే ఉండే గతంలో అని ఆయన గుర్తు చేశారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సర్వే నంబర్ 185, బేగంపేట లో ఓ మహిళ భూమి టీడీఆర్ పాలసీ కింద 42 కోట్లు టీఆర్‌ఎస్ నాయకుడిని అడ్డంగా పెట్టుకుని ధారాదత్తం చేశారని, విటన్నింటిపై విచారణ జరగాలన్నారు. అధికారం లో ఉండి దోచుకున్నారని విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Viral Video: అద్భుతంగా కారు నడిపిన 95 ఏళ్ల బామ్మ.. వీడియో చేసిన నాగాలాండ్ మంత్రి
