Site icon NTV Telugu

Kodanda Reddy : బీఆర్‌ఎస్‌ హయాంలో భారీ భూకుంభకోణం జరిగింది

Kodanda Reddy

Kodanda Reddy

గత ప్రభుత్వంలో భూముల కుంభకోణం ఎక్కడ లేని విదంగా జరిగిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుంకుంటా మండలం 164/1 లో 26 ఎకరాల అటవీ భూమి..జూన్ 2023 లో ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. డిఫెన్స్ కి సబంధించిన 60 ఎకరాలు జూన్ లో ప్రయివేటు వాళ్ళకు అప్పగించింది గత ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. బొమ్మరాసిపేటలో.. 1065 ఎకరాల ప్రయివేటు భూమి.. భూమి..హక్కు దారులకు దక్కకుండా ధరణి ని అడ్డుపెట్టుకుని వేరే వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆయన వెల్లడించారు.

దీంట్లో బీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎంపీ కంపెనీ కి ధారాదత్తం చేశారని, కానీ హక్కుదారులకు మాత్రం ధరణిలో కేటాయింపు లేదన్నారు. నిషేధిత జాబితాలో పెట్టి.. కావాల్సిన వారికి ఎన్నికల ముందు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా తనకు బీనామిలకు భూములు అప్పగించారని, షాద్ నగర్ లో 9 లక్షల చొప్పున అసైన్డ్ భూములు కంపెనీ లకు అప్పగించారన్నారు. సమగ్ర ఆధారాలు రెవెన్యూ మంత్రి కి అప్పగించామని ఆయన పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మజీద్ పూర్ గ్రామం..సర్వే 90,91,100,103 లో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పట్టా చేశారన్నారు.

Exit mobile version