Site icon NTV Telugu

MLA Sudhakar: జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చా.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Mla Sudhakar

Mla Sudhakar

MLA Sudhakar: ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు వేదమని, ఆయన ఆదేశాలు సిరసావహిస్తామని కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే వెల్లడించారు. జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యానని ఆయన అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రజల కోసమే కష్టపడ్డానన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తామన్నారు.

Read Also: Kodali Nani: రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారు..

టికెట్ నాకే వస్తుందని ఆశాభావంతో వున్నానని ఎమ్మెల్యే సుధాకర్ వెల్లడించారు. నిజంగా నాకు ప్రజల్లో బాగాలేదన్నారు. జగనన్న తప్పుకో అని చెప్పితే తప్పుకుంటానని, అందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. ఎంతోమంది ఆశావహులు వస్తుంటారని, రాజకీయంలో కాంపిటేషన్ ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

Exit mobile version