NTV Telugu Site icon

Kodali Nani On 2024 Elections: 2024 ఎన్నికల్లో టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లే

Kodali

Kodali

దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్న మొదటి నాయకుడు ఎన్టీఆర్ అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ చనిపోయి 26 ఏళ్ళు పూర్తి అయినా ఇప్పటికీ తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అటువంటి వ్యక్తిని చంద్రబాబు ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది??ఎన్టీఆర్ బతికి ఉండగా ఎందుకు టీడీపీ అధ్యక్ష పదవి నుండి ఆయన్ను చంద్రబాబు సస్పెండ్ చేశాడు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి దేశంలో ఉన్న అన్ని పార్టీలు చెబుతాయి. అటువంటి మహానుభావుడి పై చంద్రబాబు ఎందుకు చెప్పులు వేశాడు. ఆయన మరణానికి ఎందుకు కారణం అయ్యావో చంద్రబాబు ఎందుకు చెప్పడు?

Read Also:Top Headlines @5PM: టాప్ న్యూస్

ఎన్టీఆర్ సిద్ధాంతాల్లో ఒకటి అయినా పాటించావ్…పేదల పార్టీని పెత్తందార్ల పార్టీగా మార్చావ్. చంద్రబాబు ఒక నీచుడు.. దేవుడు లాంటి ఎన్టీ రామారావును ఆత్మక్షోభ పెట్టావ్. ఎన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.. కాంగ్రెస్ కు ఆయన దిక్సూచి. కూకటి వేళ్ళతో టీడీపీని పెకిలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నాడు. 2023లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. చంద్రబాబు మళ్ళీ దేవుడి స్క్రిప్ట్ ఏది అని మొన్న అడుగుతున్నాడు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నావ్. 2024 ఎన్నికల్లో టీడీపీ నాలుగు సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు కొడాలి నాని.

ఇది దేవుడి స్క్రిప్ట్. చంద్రబాబు హయాంలో ఏడు సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఒక్కసారే మెజారిటీ స్థానాలు సాధించాడు. చంద్రబాబు బొంబాయిగాడు. రాహుల్ గాంధీ గురించి స్పందించటానికి రాష్ట్ర ప్రజలకు పనీ పాటా ఏమీ లేదు అనుకుంటున్నారా??మన్మోహన్ సింగ్ ఆర్డినెన్సు తెస్తే చించేసింది రాహుల్ గాంధీ అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.

Read Also: Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి

Show comments