Site icon NTV Telugu

Kodali Nani: రజనీకాంత్‌ జీరో..! సూపర్‌ స్టార్‌పై కొడాలి నాని ఫైర్‌..

Kodali

Kodali

Kodali Nani: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇప్పుడు వైసీపీ నేతలకు టార్గెట్‌గా మారిపోయారు.. రజనీకాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. ఏపీలో జీరో అయిన రజనీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పవన్‌ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజనీకాంత్ ను, చంద్రబాబు రంగంలోకి దించాడని పేర్కొన్న ఆయన.. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కల్యాణ్‌ గ్రహించాలన్నారు.. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను.. ప్రజలెవరూ పట్టించుకోరన్న ఆయన.. ఎన్టీఆర్ బతికుండగా రజనీ ఏం చేశాడు..? ఇప్పుడెం మాట్లాడుతున్నాడు..? అంటూ విరుచుకుపడ్డారు.. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే రజని ,తెలుగు ప్రజలకేం చెప్పాడు అని ప్రశ్నించారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ.. రజనీకాంత్ మరింత దిగజారుతున్నాడు అని మండిపడ్డారు కొడాలి నాని.

Read Also: Vellampalli Srinivas: ఎంతమంది రజనీకాంత్‌లు వచ్చినా ప్రజలు నమ్మరు..

ఇక, నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌ లో ఘనంగా నిర్వహించారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం విదితమే.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న రజనీకాంత్.. ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ, అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోంది. కానీ ఎన్టీఆర్ గురించి రాజకీయం మాట్లాడక తప్పడం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అమోఘం. ఎన్టీఆర్ తో టైగర్ సినిమా చేశాను. ఎన్టీఆర్‌ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి. యాదృచ్చికమైన నాకు అది ఎంతో ఆనందాన్ని కలుగజేసిందని పేర్కొన్న విషయం విదితమే. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు నాకు 30 ఏళ్లుగా మిత్రుడు.. చంద్రబాబు ఐటీ విజన్‌ ఏంటో ప్రపంచానికి తెలుసు. గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే.. బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ సైడ్ వెళ్లాను.. హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు. హైదరబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతుందని రజనీకాంత్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే. కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version