Kodali Nani Counter to Pawan Kalyan: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి మీదా దారుణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు, అవసరం కోసం వాడుకోవడం ఉందని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబుతో కలిస్తే పవన్ కి ఎన్టీఆర్ కి పట్టిన గతే పడుతుందని అన్నారు. పవన్ ప్రజల్లో తిరగవచ్చు, జగన్ మీద విమర్శలు చేయవచ్చు కానీ ముందుగా రాజకీయాల్లో ఉండే దొంగలు, 420 లను పక్కన పెట్టాలని హితవు పలికారు. పవన్ ప్రజల మధ్య వారాహి యాత్ర చేస్తే ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్న ఆయన పవన్ తో నేరుగా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తే కుదర లేదని అందుకే మీడియా ముఖంగా చెబుతున్నానని అన్నారు.
Minister Adimulapu Suresh: గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా?
చంద్రబాబు ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకునే వారు పవన్ కు మద్దతు దారులుగా మారారని, పవన్ మద్దతుతో చంద్రబాబుని ప్రతిపక్ష నేతగా చేయాలని ఆయన మద్దతు దారులు భావిస్తున్నారని కొడాలి నాని అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మద్దతుదారులతో కలిసి పవన్ మాపై దాడి చేస్తే ఊరుకోమని పేర్కొన్న ఆయన చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ అమలు చేస్తే రాజకీయంగా ఎదుర్కొంటామని పేర్కొన్న ఆయన చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారు ఎవరైనా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక గతంలో టీడీపీ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన కొడాలి నాని 2014 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకుని అప్పటి నుంచే జగన్ కు నమ్మిన బంటుగా మారారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి కూడా అయిన ఆయన తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాత్రం పదవికి దూరమై ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.