వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Read Also: GVL: విశాఖ గ్రోత్ హబ్గా మారుతుంది..
ఇప్పటికే ఆరు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. మరో జాబితాను సిద్ధం చేస్తుంది. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. కాగా.. వైసీపీ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. అయితే గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ.. అన్ని నియోజకవర్గ స్థానాలపై ఫోకస్ పెట్టి మార్పులు చేర్పులు చేస్తోంది.
Read Also: Woman physically Abused: భర్త కళ్లేదుటే భార్యపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
