NTV Telugu Site icon

Health Tips : ఒక ఆరోగ్య వంతుడైన మనిషి రోజుకు ఎన్ని సార్లు బాత్ రూంకు వెళ్తాడో తెలుసా ?

New Project (38)

New Project (38)

Urinary Frequency: మనం బతకడానికి రోజూ ఆహారం, నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తీసుకున్న వాటి నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపడం అంతే కీలకం. మనం రోజూ తీసుకునే నీరు సహా ఇతర ద్రవపదార్థాలను శరీరంలోని వ్యవస్థలు చెమట, మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. ఇందులో మూత్ర విసర్జన అనేది ప్రతీ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి చాలా కీలక ప్రక్రియ. అయితే ఇది కూడా సాధారణ స్థాయిలో ఉండాలి. మూత్ర విసర్జన తక్కువైనా లేదా ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చినా అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొంతమంది రోజులో తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఎక్కువ నీళ్లు తాగినా, వాతావరణం చల్లగా ఉన్నా మూత్రం ఎక్కువగా రావడం సహజం. కానీ అసాధారణంగా మూత్ర విసర్జన చేస్తుంటే మాత్రం అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. దానిని ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.

Read Also:Devara : ముగింపు దశకు చేరుకున్న దేవర షూటింగ్..?

తరచుగా మూత్రం పోవాల్సి వస్తే వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితి మీకు చాలా కాలంగా కొనసాగితే ఒకసారి డాక్టర్లను సంప్రదించి సూచనల మేరకు పరీక్షలు చేయించుకోవడం మంచిది. మరి ఇక్కడ అతి మూత్ర విసర్జన ఆని ఎలా తెలుస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also:SA vs BAN: మొన్న భారత్‌.. నిన్న దక్షిణాఫ్రికా! చిన్న లక్ష్యాన్ని కాపాడుకున్న జట్లు

– వాస్తవానికి ఒక వ్యక్తి రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు తాగితే రోజులో ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడట . నాలుగు సార్లు కన్నా తక్కువగా లేక 11 సార్లు కన్నా ఎక్కువగా వస్తే వెంటనే వైద్యుడిని కలవడం చాలా మంచిదంటున్నారు
– మరి ముఖ్యంగా మూత్రం రంగు మారిపోతూ ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
– మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. దానివల్ల మూత్రశయం ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్లు వస్తాయట
– ఆరోగ్యంగా ఉన్న మనిషి మూత్రం పసుపు లేదా తెలుపు కలగలిపిన రంగులో మాత్రమే ఉంటుందట. ఆ రంగు మారితే అంటే ఎరుపు రంగులో కనుక మూత్రం వస్తే కచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో రోగం ఉన్నట్లే ..
– వయసు మీద పడే కొద్ది మూత్రానికి తరచూ వెళ్లాల్సి ఉంటుంది.
– ప్రెగ్నెన్సీ టైంలో, డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా మూత్రం విసర్జనకు వెళ్తుంటారు.
– జంక్ ఫుడ్ తిన్నప్పుడు మూత్రం వాసన మారుతుంది.
– సాధారణంగా మూత్ర విసర్జన వ్యవధి ఏడు నుంచి పది సెకండ్లు మాత్రమే ఉంటుందట .. ఎక్కువగా మూత్ర విసర్జన సమయం పెరిగితే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు.