Water Proof vs Resistant: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య తేడా ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Proof vs Resistant: మనిషి ఇది వరకు పంచభూతాలతో హాయిగా జీవించేవాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచభూతాలకు తోడుగా మరో భూతం తయారైంది. అదే మొబైల్ భూతం. అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే ప్రస్తుతం మనిషి ఫోన్ లేకుండా రోజును గడపడం చాలా కష్టంగా మారింది. మొదట్లో ఫోన్ అంటే కేవలం మాట్లాడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఎప్పుడు అయితే స్మార్ట్ఫోన్లు వచ్చాయో.. వాటికి మనిషి దాసోహం అయ్యాడు. కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేయడానికి మాత్రమే కాకుండా ప్రతి పనికి అవసరమైనవిగా మారాయి ఈ స్మార్ట్ ఫోన్స్. ఈ కారణంగా రోజురోజుకి కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లలో అనేక అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు నీటిలో మొబైల్ పడినా కూడా పాడైపోని కొన్ని ఫోన్లు వచ్చాయి. కానీ, ప్రతి ఫోన్ ఇలా ఉండదు. ఒకవేళ ఉన్నా.. ప్రతిదానికి నీటి నిరోధక లక్షణం ఒకే విధంగా పనిచేయాల్సిన అవసరం లేదు.
Read Also: Suryakumar Yadav: 15 ఏళ్ల రికార్డు బద్దలు.. క్రికెట్ గాడ్ రికార్డుకు చెక్‌మేట్ చెప్పిన సూరీడు..!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఒకవేళ మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. వాటర్‌ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు ప్రజలు ఈ రెండింటినీ ఒకటే అని అనుకుంటారు. అయితే, వాటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. నీటి నిరోధక అంటే.. తేలికపాటి వర్షం లేదా తుంపరల నుండి కొంత రక్షణను అందించడానికి రూపొందించబడ్డాయి. వీటికి ఒక ప్రత్యేక రకమైన పూత ఉంటుంది. దీని వలన కొంచెం నీరు కూడా లోపలికి వెళ్ళదు. కానీ, అలాంటి ఫోన్ లను నీటిలో ఎక్కువసేపు లేదా పూర్తిగా ముంచితే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే.. నీటి నిరోధక ఫోన్లు పరిమిత పరిస్థితులలో మాత్రమే నీటి నుండి సురక్షితంగా ఉండగలవు. ఇవి రోజువారీ తేలికపాటి తేమ లేదా వర్షం నుండి మాత్రమే రక్షించగలవు.
Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్
ఇక వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్స్ విషయానికి వస్తే.. వీటిని నీరు అస్సలు లోపలికి వెళ్లని విధంగా తయారు చేస్తారు. ఇటువంటి ఫోన్లు లోతైన నీటిలో కూడా దెబ్బతినకుండా ప్రత్యేక సీలింగ్, మెటీరియల్ తో తయారు చేయబడతాయి. సాధారణంగా IP68 లేదా IP69 రేటింగ్ ఉన్న ఫోన్లను వాటర్ ప్రూఫ్ గా పరిగణిస్తారు. ఈ ఫోన్లు నీటిలో కొంత సమయం పాటు, కొంత లోతు వరకు మునిగిపోయిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాయి. నీరు, ధూళి నుండి మొబైల్ ఎంత రక్షణను అందిస్తుందో IP రేటింగ్ చూపిస్తుంది. IPX4 నుండి IPX6 వరకు రేటింగ్‌లు ఉన్న ఫోన్లు తేలికపాటి వర్షం లేదా తుంపరలకు అనుకూలంగా ఉంటాయి. అదే నీటి లోపల పడినా పనిచేసేలా ఉండాలంటే మాత్రం IPX7 నుండి IPX9K రేటింగ్ కలిగి ఉండటం అవసరం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!