Site icon NTV Telugu

Water Proof vs Resistant: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య తేడా ఏంటో తెలుసా..?

Water Proof Vs Resistant

Water Proof Vs Resistant

Water Proof vs Resistant: మనిషి ఇది వరకు పంచభూతాలతో హాయిగా జీవించేవాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పంచభూతాలకు తోడుగా మరో భూతం తయారైంది. అదే మొబైల్ భూతం. అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే ప్రస్తుతం మనిషి ఫోన్ లేకుండా రోజును గడపడం చాలా కష్టంగా మారింది. మొదట్లో ఫోన్ అంటే కేవలం మాట్లాడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఎప్పుడు అయితే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయో.. వాటికి మనిషి దాసోహం అయ్యాడు. కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేయడానికి మాత్రమే కాకుండా ప్రతి పనికి అవసరమైనవిగా మారాయి ఈ స్మార్ట్ ఫోన్స్. ఈ కారణంగా రోజురోజుకి కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో అనేక అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు నీటిలో మొబైల్ పడినా కూడా పాడైపోని కొన్ని ఫోన్లు వచ్చాయి. కానీ, ప్రతి ఫోన్ ఇలా ఉండదు. ఒకవేళ ఉన్నా.. ప్రతిదానికి నీటి నిరోధక లక్షణం ఒకే విధంగా పనిచేయాల్సిన అవసరం లేదు.

Read Also: Suryakumar Yadav: 15 ఏళ్ల రికార్డు బద్దలు.. క్రికెట్ గాడ్ రికార్డుకు చెక్‌మేట్ చెప్పిన సూరీడు..!

ఒకవేళ మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. వాటర్‌ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు ప్రజలు ఈ రెండింటినీ ఒకటే అని అనుకుంటారు. అయితే, వాటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. నీటి నిరోధక అంటే.. తేలికపాటి వర్షం లేదా తుంపరల నుండి కొంత రక్షణను అందించడానికి రూపొందించబడ్డాయి. వీటికి ఒక ప్రత్యేక రకమైన పూత ఉంటుంది. దీని వలన కొంచెం నీరు కూడా లోపలికి వెళ్ళదు. కానీ, అలాంటి ఫోన్‌ లను నీటిలో ఎక్కువసేపు లేదా పూర్తిగా ముంచితే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే.. నీటి నిరోధక ఫోన్లు పరిమిత పరిస్థితులలో మాత్రమే నీటి నుండి సురక్షితంగా ఉండగలవు. ఇవి రోజువారీ తేలికపాటి తేమ లేదా వర్షం నుండి మాత్రమే రక్షించగలవు.

Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్

ఇక వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్స్ విషయానికి వస్తే.. వీటిని నీరు అస్సలు లోపలికి వెళ్లని విధంగా తయారు చేస్తారు. ఇటువంటి ఫోన్లు లోతైన నీటిలో కూడా దెబ్బతినకుండా ప్రత్యేక సీలింగ్, మెటీరియల్‌ తో తయారు చేయబడతాయి. సాధారణంగా IP68 లేదా IP69 రేటింగ్ ఉన్న ఫోన్‌లను వాటర్‌ ప్రూఫ్‌ గా పరిగణిస్తారు. ఈ ఫోన్లు నీటిలో కొంత సమయం పాటు, కొంత లోతు వరకు మునిగిపోయిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాయి. నీరు, ధూళి నుండి మొబైల్ ఎంత రక్షణను అందిస్తుందో IP రేటింగ్ చూపిస్తుంది. IPX4 నుండి IPX6 వరకు రేటింగ్‌లు ఉన్న ఫోన్‌లు తేలికపాటి వర్షం లేదా తుంపరలకు అనుకూలంగా ఉంటాయి. అదే నీటి లోపల పడినా పనిచేసేలా ఉండాలంటే మాత్రం IPX7 నుండి IPX9K రేటింగ్ కలిగి ఉండటం అవసరం.

Exit mobile version