NTV Telugu Site icon

Care Hospital: రోబోతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

Care Hospitals

Care Hospitals

Care Hospital: హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌లో రోబో సాయంతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ మేరకు కేర్‌ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక మీదట కేర్ హాస్పిటల్‌లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు అధునాతన సాంకేతికత కలిగిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ వారి వెలిస్ రోబో అందుబాటులో ఉంటుందని ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్‌ డాక్టర్ రత్నాకర్‌రావు తెలియజేశారు. “వేలిస్ రోబో” తో మోకాలి మార్పిడి వలన కలిగే ప్రయోజానాల గురించి ఆయన వివరించారు. రోబో సహాయంతో చేసే మోకాలి మార్పిడితో ఖచ్చితమైన కొలతలతో మోకాలి ఎముకలను చెక్కడం వల్ల అత్యంత ఖచ్చితత్వంతో ఇంప్లాంట్స్‌ని అమర్చవచ్చని తెలిపారు. దీని వల్ల మోకాలి మార్పిడి తర్వాత కూడా, నడిచేటప్పుడు తక్కువ నొప్పితో పాటు సహజమైన అనుభవం కలుగుతుందన్నారు. దీని వల్ల త్వరగా కోలుకోవచ్చని ఆయన అన్నారు.

Read Also: Ramchandra Poudel: తీవ్ర అస్వస్థతకు గురైన నేపాల్ అధ్యక్షుడు.. ఢిల్లీకి తరలింపు

మారిన జీవనశైలి వల్ల ఆరోగ్యం పట్ల ప్రజల అవగాహన పెరగడంతో చిన్న వయసులోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం పెరుగుతుంది. అందువలన ఒకసారి మోకాలి మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా కనీసం 20 సంవత్సరాలు పేషంట్‌కి ఏ ఇబ్బంది ఉండకపోవడం కాకుండా రోజువారీ కార్యక్రమాలు, వ్యాయామాలు ఎలాంటి నొప్పి లేకుండా చేసుకోగలగాలి. ఇందుకు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చక్కని పరిష్కారం. గత 20 సంవత్సరాలుగా మోకాలి మార్పిడి చికిత్సలో జరిగే ఇబ్బందులను ఈ సాంకేతికత వల్ల అధిగమించవచ్చని డాక్టర్ రత్నకర్ రావు తెలియజేశారు.

Show comments