తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది. అయితే వీరిద్దరిలో ఒకరికి కెప్టెన్ బాధ్యతలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
Read Also: Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ రాబోయే సీజన్‌కు కెప్టెన్ ఎవరో ఒక సూచన ఇచ్చారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ను కాకుండా.. అక్సర్ పటేల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ESPN Cricinfoతో జిందాల్ మాట్లాడుతూ.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే ఆటగాడిగా పేర్కొన్నారు. కేఎల్ రాహుల్‌తో కూడా చర్చలు జరిగాయని, కెప్టెన్సీ గురించి మాట్లాడటం కాస్త అకాలమని అన్నారు. అక్షర్ పటేల్ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అంతేకాకుండా.. అతను గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
Read Also: Cyclone Alert for AP: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను రూ. 16.50 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించారు. ఈ వేలంలో ఢిల్లీ కేఎల్ రాహుల్‌ను అత్యధిక రూ.14 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు.