IND vs SA: రాణించిన రాహుల్.. 245 పరుగులకు టీమిండియా ఆలౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA: సెంచూరియన్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేసి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కేఎల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ యాభై పరుగుల మార్కును తాకలేకపోయారు.
Kota Bommali PS : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కోట బొమ్మాళి పీఎస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
208/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఈరోజు 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 238 పరుగుల స్కోరుపై టీమిండియాకు తొలి దెబ్బ తగిలింది. 22 బంతుల్లో 5 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ వేసిన బంతికి మహ్మద్ సిరాజ్ ఔటయ్యాడు. ఆ తర్వాత.. కేఎల్ రాహుల్ నాంద్రే బెర్గర్ బంతికి పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ కు సౌతాఫ్రికా గడ్డపై ఇది రెండో సెంచరీ. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబాడ అద్భుత బౌలింగ్ చేశాడు. రబాడ 20 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. తొలి టెస్టు ఆడుతున్న నాండ్రే బెర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కో యూన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ తలో వికెట్ తీశారు.
Devil: డెవిల్ రిలీజ్ కి ముందు నవీన్ మేడారం బహిరంగ లేఖ.. అదేదీ నిజం కాదంటూ!
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. నిర్ణీత వ్యవధిలో భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 2 పరుగులు, విరాట్ కోహ్లీ 38, శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేశారు. అయితే ఇప్పుడు భారమంతా భారత బౌలర్లపైనే.. వారు సౌతాఫ్రికా బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!